TS LAWCET 2022: తెలంగాణ లాసెట్‌ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే..?

TS LAWCET 2022: టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.

Update: 2022-04-05 11:21 GMT

TS LAWCET 2022: తెలంగాణ లాసెట్‌ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే..?

TS LAWCET 2022: టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. మూడు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 6 వరకు కొనసాగుతుంది. ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000లు దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఆలస్య రుసుంతో జులై 12 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. పరీక్షలు కూడా అదేనెల (జులై‌) 21, 22 తేదీల్లో జరగనున్నాయి. ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి డిగ్రీ లేదా ఇంటర్‌లో జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీలకు వరుసగా 45, 42, 40 శాతం అర్హత మార్కులు తప్పనిసరిగా ఉండాలి.

జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో 45%, 42% మరియు 40% కంటే తక్కువ మార్కులు వచ్చినట్లయితే, ఆ అభ్యర్థులు ఇదే శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా B.Ed లో తెచ్చుకుంటే మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అర్హులు అవుతారు. పూర్తివివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tsche.ac in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి వయో పరిమితి ఉండదు. ఎవరైనా ఎంట్రన్స్ రాయవచ్చు.

5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు..

5 సంవత్సరాల LLBకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండేళ్ల ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్10+2 లేదా ఇతర సమాన పరీక్ష, కోర్సులో సంబంధిత విశ్వవిద్యాలయం లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45% , 42%, 40% శాతంతో ఉత్తీర్ణత సాధిస్తే ఈ కోర్సుకు అర్హులుగా పరిగణిస్తారు. 

Tags:    

Similar News