TS Inter Exams 2021: నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
TS Inter Exams 2021: పరీక్షలకు హాజరుకానున్న 4,59,237 మంది విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 1,768 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
TS Inter Exams 2021: కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 2వరకు పరీక్షలు జరగుతాయి. ఎగ్జామ్స్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా కారణంగా గతేడాది ఆన్‌లైన్ విధానంలోనే క్లాసులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఆ సమయంలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది సర్కార్. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు కొనసాగనుండగా.. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష‌్టం చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదే విధంగా అనారోగ్య విద్యార్థులు పరీక్ష రయడానికి ప్రత్యేక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో కొత్తగా మొబైల్ యాప్ సేవలను వినియోగించనున్నారు. మాల్ ప్రాక్టీస్, బ్లాంక్ బార్‌కోడ్, ఆబ్జెక్స్, డ్యామేజ్డ్, ఎయిడెడ్ క్యాండేట్స్ వంటి వారి కోసం ఈ యాప్‌ను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది.