TS Govt announced exgratia to Srisailam Victims: శ్రీశైలం ఘటన: బాధిత కుటుంబాలకు పరిహారం
TS Govt announced exgratia to Srisailam Victims: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నష్ట పరిహరం ప్రకటించింది.
TS Govt announced exgratia to Srisailam Victims: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నష్ట పరిహరం ప్రకటించింది. డీఈ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు, మిగతా మృతుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్లాంట్‌లో ఏ మేరకు నష్టం జరిగిందే ఇప్పుడే అంచనా వేయలేమని మంత్రి వెల్లడించారు.
కాగా.. శ్రీశైలంలో జెన్‌కో ఆస్పత్రి మార్చురీ దగ్గర జెన్‌కో ఉద్యోగుల ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా ఏ మాత్రం సరిపోదని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సీఎం కనీసం మృతుల కుటుంబాలను కూడా పరామర్శించలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.