TS EDCET 2022: తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..?

TS EDCET 2022 : తెలంగాణ ప్రభుత్వం ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2022-04-05 09:51 GMT

TS EDCET 2022: తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..?

TS EDCET 2022 : తెలంగాణ ప్రభుత్వం ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ షెడ్యూలు విడుదల చేసినట్లు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాలని పేర్కొన్నారు. లేట్ ఫీజు రూ.250తో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. మొత్తం 19రీజిన‌ల్ సెంట‌ర్లు, 55 ప‌రీక్ష కేంద్రాల‌తో ఎడ్ సెట్ ఎంట్రెన్స్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిగ్రీ , ఇంజనీరింగ్ లో 50 శాతం మార్క్స్ తో పాస్ అయిన వారు దరఖాస్తుకు అర్హులని ప్రక‌టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ద‌ర‌ఖాస్తు దారుల‌కు 40 శాతం మార్కులు వ‌చ్చిన వారు అర్హులు అని వివ‌రించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 50శాతం మార్కులతో డిగ్రీ, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే చాలని కన్వీనర్ తెలిపారు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశ పరీక్ష రాయొచ్చని పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు బీఈడీకి అనర్హులని కన్వీనర్ స్పష్టం చేశారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.

Tags:    

Similar News