దేశంలో ఒక సంచలనం జరిగి తీరుతుంది : కేసీఆర్
KCR: రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ...
KCR: ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీ గడిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోకలిసి దక్షిణ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. కేసీఆర్ బృందానికి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్వాగతం పలికారు. తర్వాత పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్‌తోకలిసి కేసీఆర్ తిలకించారు. ఈసందర్భంగా పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు తెలియజేశారు.
పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తో కలిసిన సీఎం కేసీఆర్.. మొహల్లా క్లినిక్ సందర్శించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు కేసీఆర్. కేజ్రీవాల్ సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చతున్నారన్నారు.
ఈ విధానంలో తెలంగాణలో అమలు చేస్తామన్నారు. ఢిల్లీ బోధన విధానాలు దేశానికి ఆదర్శనీయమన్నారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉందని... ఆ సంచలనం జరిగి తీరుతుందన్నారు. భవిష్యత్‌లో ఏం జరగబోతుందో అందరూ చూస్తారని చెప్పారు కేసీఆర్.