ఈనెల 15న టీఆర్ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం
* తెలంగాణభవన్‌లో జరగనున్న సమావేశం.. పాల్గొననున్న టీఆర్ఎస్ ఎంపీలు..
TRSLP: ఈనెల 15న టీఆర్ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీకానున్నారు. సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం హాజరుకానుంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత మొదటిసారి టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంకానుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ సీఎం కేసీఆర్ అభినందించనున్నారు.
ఇక ఇప్పటికే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటికే సిద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుండటంతో పార్టీ బలోపేతంపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. భారత రాష్ట్ర సమితికి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లోకి వెళ్లడంపై దృష్టి సారించనున్నారు. ఒక పక్క రాష్ట్రం, మరోపక్క దేశంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసే అంశాలపై సూచనలు చేయనున్నారు. బీజేపీ ఆరోపణలను తిప్పి కొట్టేలా ప్లాన్ రెడీ చేయనున్నారు. ఇక ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.