Local Body MLC Election: ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఏకగ్రీవ ప్రయత్నాలు విఫలం
*స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించని టీఆర్ఎస్ వ్యూహం *పుష్పారాణి అందుబాటులోకి రాకపోవడంతో అధికార పార్టీనేతల్లో టెన్షన్
Local Body MLC Election: ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం ఫలించలేదు. ఏకగ్రీవం కోసం అధికార పార్టీ నేతలు చివరి వరకు జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
మొత్తం 24 మందిలో 22 మంది అభ్యర్దులు విత్ డ్రా అయ్యారు. మరో అభ్యర్ధి పుష్పారాణి విత్ డ్రా విషయంలో హై డ్రామా కొనసాగింది. పుష్పరాణి ఉపసంహరించుకున్నట్లు అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. ఇదంతా దుష్ప్రచారం అంటూ పుష్పరాణి అనుచరులు కొట్టి పారేశారు. పుష్పరాణి అందుబాటులోకి రాకపోవడంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొన్నది.
మరో వైపు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలెక్టరేట్ ఎదుట ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్పరాణి ఆందోళనకు దిగింది. MLC అభ్యర్థిగా తాను పోటీలోనే ఉన్నానంటూ స్పష్టం చేసింది. తన సంతకాన్ని అధికార పార్టీ నేతలు ఫోర్జరీ చేశారంటూ ఆందోళన చేపట్టింది.
పుష్పరాణికి మద్దతుగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు ఆదివాసీలు, బీజేపీ కార్యకర్తలు. సమాచారం అందుకున్న పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.