కేసీఆర్‌ కంటే పెద్ద హిందువు ఎవరూ లేరు : కేకే

హిందుత్వం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద హిందువు మరొకరు లేరని అన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ సభ్యులు కె.కేశవరావు (కేకే). సీఎం కేసీఆర్ చేసిన యాగాలు, యజ్ఞాలు మరెవ్వరు కూడా చేయలేదని అన్నారు.

Update: 2020-11-21 12:07 GMT

హిందుత్వం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద హిందువు మరొకరు లేరని అన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ సభ్యులు కె.కేశవరావు (కేకే). సీఎం కేసీఆర్ చేసిన యాగాలు, యజ్ఞాలు మరెవ్వరు కూడా చేయలేదని అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశవరావు ఈ వ్యాఖ్యలు చేశారు. అందరికి న్యాయం చేయలనుకోవడమే నిజమైన హిందుత్వం అని అయన అన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. 85 శాతం సీట్లు బీసీలకు, ఎస్సీలకు 13 సీట్లు, ఎస్టీలను 3 సీట్లు, 50 శాతం మహిళలకి సీట్లు ఇచ్చామని అన్నారు. దిన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీ ఎంత నిబద్దతో ముందుకు వెళ్తుందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఇక వరుదల వలన నష్టపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసి సీఎం కేసీఆర్ ఎంతో చలించి పోయి వరదసాయం రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే వరదసహయాన్ని ఆపమని బీజేపీ నేతలు ఈసీకి లేఖ రాశారా లేదా అన్నది ముఖ్యం కాదని, అభ్యంతరం వ్యక్తం చేశారా లేదా అన్నదే ప్రధానమని అన్నారు.

వరద సాయంపై ఈసీకి లేఖ రాయలేదు : బండి సంజయ్

వరద సాయంపై ఈసీకి తాను లేఖ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వెల్లడించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, టీఆర్ఎస్ కుట్రపన్నుతోందంటూ మండిపడ్డారు. బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారన్న బండి సంజయ్, టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అన్నీ అభద్ధాలే చెప్తున్నారంటూ మండిపడ్డారు. అటు వరదసాయం నిలిపివేతపై తానూ ఈసీకి తాను లేఖ రాసినట్లు చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు పిలిస్తే ఎందుకు రాలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

Tags:    

Similar News