జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ 17 స్థానాల్లో ఓడిపోయింది. ఆరు డివిజన్లలో 310 ఓట్ల లోపు తేడాతో విజయాన్ని కోల్పోయింది. బీఎన్‌రెడ్డినగర్‌లో 32 ఓట్లతో ఓటమిపాలైన గులాబీ పార్టీ, మల్కాజిగిరిలో 178, అడిక్‌మెట్ 227, హస్తినాపురం 279, వినాయక్‌నగర్ 287, రాంగోపాల్‌పేటలో 310 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
అలాగే.. మరో ఏడుచోట్ల వెయ్యి ఓట్లలోపు తేడాతో కారు పార్టీ ఓటమిని ఎదుర్కొంది. రామ్‌నగర్‌లో 528, మూసాపేట 538, రామంతాపూర్ 655, వనస్థలిపురం 702, జూబ్లీహిల్స్ 779, మంగళ్‌హాట్ 809, సైదాబాద్‌లో 911 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. మరో నాలుగు స్థానాల్లో 15 వందల ఓట్లలోపు తేడాతో గెలుపును చేజార్చుకుంది. గచ్చిబౌలిలో వెయ్యి135 ఓట్లు, అమీర్‌పేటలో వెయ్యి 301, హబ్సిగూడలో 14 వందల 47, కవాడిగూడలో 14 వందల 77 ఓట్ల తేడాతో పరాజయం పొందింది టీఆర్‌ఎస్ పార్టీ.