TRS Leaders: ఈటల విషయంలో తొందరపడ్డామా.. గులాబీ నేతల్లో కొత్త టెన్షన్
TRS Leaders: ఈటెల వ్యవహారంలో టీఆర్ఎస్ తలచింది ఒకటి జరుగుతుంది మరోటి.
TRS Leaders: ఈటెల వ్యవహారంలో టీఆర్ఎస్ తలచింది ఒకటి జరుగుతుంది మరోటి. ఈటెలను ఇరుకున పెట్టాలనే ఉత్సాహంతో చేయిస్తున్న విచారణలు మంచి చేయక పోగా సొంత పార్టీ నేతల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఓవైపు కోర్టుల నుంచి మెట్టికాయలు మరోవైపు ఇతర మంత్రుల భూ కబ్జాల విషయాలను ప్రతిపక్షాలు వెలికితీస్తుడడం ఇబ్బందికరంగా మారింది. అసైన్డ్ భూములు, దేవాదాయ భూమల విషయంలో వేలు పెడితే రానున్న రోజుల్లో ఎంత మంది పేర్లు బయటికి వస్తాయోననే బెంగ గులాబి నేతలను వేధిస్తోంది.
మెదక్ జిల్లా ముసాయి పేట మండలం అచ్చంపేట, హాకీంపేట గ్రామాల్లోని అసైన్డ్ భూములను ఈటల కబ్జాచేశారని ఫిర్యాదు రావడం, దీంతో సీఎం విచారణ చేయించడం అటు కలెక్టర్ 66 ఎకరాల భూములు అన్యక్రాంతమయ్యాయని చెప్పడం ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. మరోవైపు కలెక్టర్ నివేదికతో ఈటల తప్పు చేసినట్లు రుజువు అయ్యిందని సీఎం కేసీఆర్ ఈటెలను మంత్రివర్గం నుంచి భర్త్‌రఫ్ చేశారు. అయితే ఈటల భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఎక్కడా రూల్స్ ఫాలో కాలేదని కోర్టు స్పష్టం చేసింది.
ఇక మేడ్చల్ జిల్లా దేవరయాంజల్‌లో సీతారామ స్వామి భూములు ఈటల కొన్నారనే ఆరోపణలతో సీఎం కేసీఆర్, నలుగురు ఐఏఎస్ అధికారులతో విచారణ చేయించడంతో ప్రతిపక్షాలు అలెర్ట్ అయ్యాయి. దేవరయాంజిల్ భూముల ఆక్రమణలో మరికొంతమంది మంత్రులు ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా భూముల వివరాలను డ్యాకుమెంట్స్‌తో సహా బయటపెట్టే సరికి అధికార పార్టీలో అంతర్గత చర్చ మొదలైంది. ఇక ఈటెల విషయంలో ఏదో చేయాలనే ఆతృతలో తామే గోతిలో పడ్డటైందని కారు నేతలు చర్చించుకుంటున్నారని టాక్.
ఇదిలా ఉంచితే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటీపడుతూ టీఆర్ఎస్ నేతల భూ ఆక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్ర బీజేపీ ఛీప్ బండి సంజయ్ ఏకంగా 70మంది కారు నేతల అక్రమాలంటూ చిట్టా భయటపెట్టారు. అటు బీజేపీకి పోటీగా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో మంత్రులు కలవర పడుతున్నారని సొంతపార్టీలోని నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఈటలపై దాడి చేయడం అటు ఉంచితే తమతమ విషయాలపై వివరణ ఇచ్చుకోవడానికే మంత్రులకు ఇబ్బందికరంగా మారింది.