Telangana: సీఎం కేసీఆర్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హన్మకొండను జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు ఆయిల్ ఫామ్ సాగుపై నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్‌కు ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, హన్మకొండను జిల్లాగా ప్రకటించినందుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.