Nagarjuna Sagar Bypoll: సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. దూసుకుపోతున్న కారు
Nagarjuna Sagar Bypoll: నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గం.కు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభం అయింది.
Nagarjuna Sagar Bypoll: నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గం.కు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభం అయింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్లు, నాలుగో రౌండ్‌లో 3,457 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వచ్చాయి.