TRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
Telangana News: టీఆర్ఎస్ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారా...?
Telangana News: టీఆర్ఎస్ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారా...? నామినేటెడ్ పోస్టులు దక్కకపోయినా పార్టీ పదవి ఉంటేనైనా బాగుండు అనుకుంటున్నారా...? అంటే సమాధానం అవును అనే వస్తోంది. అప్పుడప్పుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్న అధికారపక్షం పార్టీ పదవుల విషయంలో స్పందించడం లేదని భావన నేతల్లో నెలకొందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక విభాగాల్లో పెద్దఎత్తున పదవులకు అవకాశాలు ఉన్నా అవి కూడా దక్కడం లేదని నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు రాకున్నా పార్టీ పదవులతోనైనా సంతృప్తి చెందుదామంటే అవీ దక్కడం లేదనుకుంటున్నారు. విద్యార్థి, యువజన విభాగం పదవుల కోసం పోటాపోటీ నెలకొనగా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఊరించిన పదవులు మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్నా దక్కడం లేదని నేతలు భావిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.