Gandhi Hospital: కరోనా సోకిన గర్భిణీలకు గాంధీలో పునర్జన్మ
Gandhi Hospital: రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన గర్భిణీలను గాంధీకి తరలింపు * కరోనా విజృంభిస్తున్న వేళ 800పైగా కేసులు
Gandhi Hospital:కరోనా వేళ ప్రైవేట్ ఆస్పత్రులు మూతపడ్డాయి. ప్రభుత్వ దవాఖానలు కోవిడ్ సెంటర్లుగా మారిపోయాయి. కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించడమే కష్టమవుతున్న రోజులవి.. అలాంటి సమయంలో కరోనా వచ్చిన గర్భిణీలకు వైద్యం అందించడమంటే పెద్ద సాహసమే.. తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ డెలివరీ కేసులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాయి. కొందరు మహిళా వైద్యులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఎందరో తల్లి, బిడ్డలకు మరో జన్మ ఇచ్చారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 800లకు పైగా కోవిడ్ వచ్చిన గర్భిణీలు మరో జన్మపొందారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఏ గర్భిణీకి కరోనా సోకినా గాంధీ ఆస్పత్రికి పంపించారు. వారందరికీ మెరుగైన వైద్యం అందించామని డాక్టర్ జానికి తెలిపారు. కరోనా సమయంలో పాజిటివ్ లక్షణాలుంటేనే ఎవ్వరిని దగ్గరికి రానిచ్చేవాళ్లు కాదు. అలాంటి సమయంలో ప్రాణాలకు తెగించి డెలివరీస్ చేశామని గాంధీ గైనిక్ టీం చెబుతోంది.
కోవిడ్ సోకిన గర్భిణీలకు వైద్యం అందించాలంటే అశామాషి విషయం కాదు. వైద్యులు, సిబ్బంది తామను తాము రక్షించుకుంటూ తల్లీబిడ్డలను కాపాడాలని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఈ విషయంలో గాంధీ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారని సూపరింటెండెంట్ కొనియాడారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం మూతపడ్డాయి. కానీ సర్కార్ ఆసుపత్రులే గర్భిణీలను ప్రాణంగా చూసుకున్నాయని గాంధీ వైద్యులు గర్వంగా చెబుతున్నారు.