Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే?

సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే 17వ తేదీ వరకు.. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

Update: 2024-09-07 02:26 GMT

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే?

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌ వాసులకు పోలీసులు ట్రాఫిక్ అలెర్ట్ ఇచ్చారు.వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌లో బడా గణేష్‌తో పాటు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే 17వ తేదీ వరకు.. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. 

సొంత వాహనాలపై దర్శనానికి వచ్చే భక్తులు నెక్లెస్ రోడ్, ఐమాక్స్‌ రోటరీ వైపు నుంచి మాత్రమే రావాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్​గార్డెన్​పక్కన ఉన్న 125 అడుగుల అంబేద్కర్​విగ్రహం పక్కన పార్కింగ్​సౌకర్యం కల్పించారు. ఖైరతాబాద్‌, రాజీవ్‌ గాంధీ స్టాచ్యూ రోడ్‌, రాజ్‌దూత్‌ లేన్‌ రూట్లలో అనుమతి లేదన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సహాయం కోసం 90102 03626కు కాల్ చేయొచ్చని సూచించారు.

ఖైరతాబాద్ విశ్వేశ్వరాయ విగ్రహం నుంచి, రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వాహనాలను అనుమతించరు. అటుగా వచ్చేవారు రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నిరంకారి జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ వైపు రాజ్ దూత్ లేన్‌లోకి వాహనాలను అనుమతించరు. అలాగే ఇక్బాల్ మినార్ వైపు కూడా వాహనాలను అనుమతించరు. ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వాహనాలను అనుమతించరు. మింట్ కాంపౌండ్ లేన్ ఎంట్రన్స్ నుంచి వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/ నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వాహనాలను రానివ్వరు. నెక్లెస్ రోడ్‌లో రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు పంపిస్తారు.

నిరంకారి నుంచి వాహనాలను ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేన్, ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు. పోస్టాఫీసు దగ్గర ఓల్డ్ సైఫాబాద్ జంక్షన్ వైపు కూడా వాహనాలను రానివ్వరు.

భక్తుల భద్రత కోసం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు, -13 మంది ఇన్ స్పెక్టర్లు, 33 మంది ఎస్సైలు, 22 ప్లాటూన్ల సిబ్బంది 3 షిఫ్టుల్లో డ్యూటీలు చేయనున్నారు. 40 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగించనున్నారు.


Tags:    

Similar News