Revanth Reddy: ఈ కుంభకోణం వెనుక సిద్దిపేట కలెక్టర్ పాత్ర ఉంది
Revanth Reddy: కోకాపేట్ భూ టెండర్లలో కుంభకోణం జరిగిందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
Revanth Reddy: కోకాపేట్ భూ టెండర్లలో కుంభకోణం జరిగిందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ హయాంలో కోకాపేట్ భూములను దళితులకు కేటాయించామని, కానీ తనకు కావాల్సిన వారికి కేసీఆర్ ఇప్పుడు భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహించారు. 70కోట్లు విలువ చేసే ఎకరం భూమిని 30కోట్లకే పెద్దలకు అంటగట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణం వెనుక సిద్దిపేట కలెక్టర్ పాత్ర కూడా ఉందన్న రేవంత్ కోకాపేట్ భూములపై పోరాటం కొనసాగిస్తామన్నారు.
మరోవైపు తనను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు రేవంత్ లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ కూడా ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంపై పోలీసులు స్పందించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌కు లేఖ రాశారు. పార్లమెంట్‌కు వెళ్లకుండా తాము అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. కోకాపేట భూముల వద్ద ఆందోళనకు అనుమతి లేదని, అందువల్లే రేవంత్ నివాసం వద్ద పోలీసు బలగాలను మోహరించినట్టు స్పష్టంచేశారు.