నేటితో ఎన్నికల ప్రచారానికి తెర.. సాయంత్రం 6 గంటల వరకు ప్రచారాలకు గడువు
సాయంత్రం 6 గంటల వరకు ప్రచారాలకు గడువు
Election 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు రాజకీయ పార్టీల ప్రచారానికి సమయం ఉంది. ఆ తర్వాత లౌడ్ స్పీకర్లు మూగబోనున్నాయి. ప్రచారానికి పూర్తి స్థాయిలో తెరపడనుంది. ఆ తర్వాత ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించినా కేసులు నమోదు చేస్తామని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా 48 గంటల వ్యవధిలో ‘డ్రై’ డే సమయాన్ని సవరిస్తామని తెలిపారు. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల ఎన్నికల, పోలీస్ యంత్రాంగం చేపట్టాల్సిన ఏర్పాట్లను ప్రధాన ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. హింసకు, రీపోలింగ్‌కు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు.
‘ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకు ఆయుధాలు, మందుగుండు అక్రమ రవాణాను అడ్డుకుంటున్నట్లు.. అంతర్ రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు, ఇతర వాహనాల కదలికలపై గట్టి నిఘా పెట్టినట్లు
తెలుగు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రచార సమయం ముగిసిన వెంటనే ప్రతి నియోజకవర్గం నుంచి స్థానికేతరులు తప్పనిసరిగా వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రముఖులు, నేతలు ఆ నియోజక వర్గాల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత ఖాళీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే సమయంలో ఆలయాలున్న పట్టణాల్లోని యాత్రికులకు, పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంది. రాజకీయ పార్టీల రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఉన్నవారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఉండాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ 48 గంటలు బల్క్ సందేశాలను పంపడం నిషేధమని.. అలాంటి సందేశాలు వస్తే ఓటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మీనా తెలిపారు.