గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణల్లో భాగంగా అధికారులు గ్రామ స్థాయి నుంచి నివాస వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం రోజున సీఎం కేసీఆర్ ఆస్తి వివరాలను అధికారులకు తెలిపారు. అనంతరం ఆయన పూర్తి ఆస్తివివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం నివాసానికి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్ వచ్చి ఆస్తి వివరాలను నమోదు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా సాధారణ ప్రజల మాదిరిగానే తన కుటుంబ ఆస్తుల వివరాలను తెలిపారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఆయన తెలియజేశారు. దీంతో అధికారులు వెంటనే ఆస్తుల నమోదు యాప్‌లో నివాస గృహానికి చెందిన వివరాలను ఫోటోతో సహా ప్రత్యేకించిన యాప్‌లో నమోదు చేశారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం స్థిరాస్తుల వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకు వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సాగు భూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు. సాగు భూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి పాల్గొన్నారు.