Revanth Reddy: బురద రాజకీయాలకు స్వస్తి పలకాలి
Revanth Reddy: ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
Revanth Reddy: బురద రాజకీయాలకు స్వస్తి పలకాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రకృతి విపత్తులు వస్తే రాజకీయాలు సరికాదన్నారు. బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు..కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే బయటకు రావడం లేదన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించామని తెలిపారు. రాష్ట్రంలో 5వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామని చెప్పారు. నష్టాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోడీని ఆహ్వానించామని... సాయం చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. తక్షణ సాయం కింద కేంద్రం 2వేల కోట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా అధికారులతో రేవంత్ సమీక్ష జరిపారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.