Raghunandan Rao: ఫోన్‌ట్యాపింగ్‌లో ప్రమేయమున్న వారికి శిక్ష పడాల్సిందే
Raghunandan Rao: ట్యాపింగ్‌పై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశా
Raghunandan Rao: తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ మీద జూన్ రెండు 2014 నుంచి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రఘునందన్‌రావు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన ఎవరినీ కూడా వదలకూడదని ఆయన కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు రఘునందన్‌రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిష్పక్షపాత విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు రఘునందన్‌రావు.