మూడోరోజు 'ముద్దపప్పు బతుకమ్మ'.. వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం!
Bathukamma Festival 2022:తెలంగాణలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఆటపాటలతో సందడి చేస్తున్న మహిళలు
Bathukamma Festival 2022: తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ సంబురాలతో అలరారుతోంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై..బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల బతుకు పండుగ. పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది.
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగలో మూడోరోజైన మంగళవారం ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు. మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి పూజలు చేసి అందరూ కలసి 'బతుకమ్మ' ఆడతారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు. మూడోరోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి