హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు వాళ్ల అడ్డా కూరగాయల అమ్మకం వాళ్ల వృత్తి. ఐతే దొంగతనాలు చేయడం వారి ప్రవృత్తి. పగలంతా కూరగాయలు అమ్మేవారిగా నటిస్తూ రాత్రివేళ దోపీడీలకు రెక్కి నిర్వహించి లూఠీ చేయడం వీరి లైఫ్ స్టైల్. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రల్లో సైతం మోస్ట్ వాంటెడ్ గా పేరుగాంచిన కర్కల్ గ్యాంగ్ ను సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ భూధాన్ జిల్లా కాకర్లకు చెందిన కొందరు అదే పరిసరాల్లో ఉన్న గ్రామాల్లోని మరికొందకు వ్యక్తులు కలిసి, ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ గ్యాంగ్ కు షఖీ అహ్మద్ లీడర్. ఈ గ్యాంగ్ కన్ను హైదరాబాద్ పై పడింది. గ్యాంగ్ లీడర్ షఖీ అహ్మద్ అలియాస్ గుడ్డూ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దోపడీలు చేయడం చాలా సులభమని ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని హితబోధ చేశాడు. ఇంకేముంది డీసీఎం ఎక్కి హైదరాబాద్ కు మకాం మార్చారు.
ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన ఈ ముఠాకు తెలిసిన ఓ వ్యక్తి జగద్గిరిగుట్టలోని అంబేద్కర్ నగర్ లో ఇళ్లు అద్దెకు ఇప్పించాడు. 10 మంది సభ్యలు ఉన్న ఈ ముఠాలో ఎడుగురు పండ్లు లేదా కూరగాయాల వ్యాపారుల అవతారమెత్తగా మిగతా ముగ్గురు శివారు ప్రాంతాల్లో ఉన్న బంగారు దుఖాణాల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. ఇలా ఈనెల 18వ తేదీ రాత్రి పటాన్ చెరులోని షాప్ ను లూఠీ చేయడానికి ప్రత్నించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఠా సభ్యులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మళ్లీ రెండు రోజుల తర్వాత అదే షాప్ లో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా ప్రభాకర్ అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇది గమనించిన దొంగలు ప్రభాకర్ పై తపంచాలతో కాల్పులు జరిపి దాడి చేశారు.
ఇక రెండు సార్లు ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఈసారి ఎట్టి పరిస్ధితుల్లో మిస్ అవ్వొదని ఫిక్స్ అయ్యారు. ఐతే ఈసారి పటాన్ చెరు నుండి రూట్ దుండిగల్ మార్చారు. దుండిగల్ పీఎస్ పరిధిలోని ఓ జ్యువెలరీ దుకాణం వద్ద రెక్కీ నిర్వహించారు. ఇక ఇప్పటికే రెండుసార్లు పటాన్ చెరులో పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంతో పోలీసులు ఈ ముఠా పై నిఘా పెట్టారు. ఇంకేముంది రెక్కీ ఐపోయింది ఇక లూఠీ చేయడమే మిగిలింది అని ముఠా సభ్యులు అనుకుంటున్న సమయంలో శంషాబాద్ ఎస్ ఓటీ మరియు జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా వీరిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఏదేమైనా నగర శివారు ప్రాంత ప్రజలు మరీ ముఖ్యంగా జ్యువెలరీ షాప్ ల యజమానులు జాగ్రతగా ఉండాలని పోలీసు బాసులు హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవ్వరూ కనిపించిన తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సో బీ కేర్ ఫుల్.