కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

* సమావేశానికి హాజరు కాలేమని ప్రకటించిన తెలంగాణ * న్యాయ సంబంధిత, కోర్ట్ కేసుల నేపథ్యంలో హాజరు కాలేమన్న తెలంగాణ

Update: 2021-08-08 15:24 GMT

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (ఫైల్ ఫోటో)

Telangana: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. రేపు జరగనున్న గోదావరీ రివర్ బోర్డు సమావేశానికి హాజరు కాలేమని స్పష్టం చేసింది. న్యాయ సంబంధిత, ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసుల నేపథ్యంలో హాజరుకాలేమని లేఖలో పేర్కొంది. సమావేశానికి మరో తేదీని ప్రకటించాలని కృష్ణా, గోదావరి బోర్డుని తెలంగాణ సర్కార్ కోరింది.

ఈ మేరకు రెండు బోర్డులకు మరోమారు విడి విడిగా లేఖలు రాసింది. అయితే కార్యాచరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశం నిర్వహిస్తామని హాజరుకావాలని KRMB, GRMBలు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశాయి.

Tags:    

Similar News