అంతగా ఉపయోగపడని రాయదుర్గం మెట్రో స్టేషన్
హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. నిత్యం ట్రాఫిక్ వలయంలో చిక్కుకునే మాదాపూర్ లో మెట్రో సేవలు ఎంతో ఉపయోగపడతాయి.
హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. నిత్యం ట్రాఫిక్ వలయంలో చిక్కుకునే మాదాపూర్ లో మెట్రో సేవలు ఎంతో ఉపయోగపడతాయి. గతంలో హైటెక్ సిటీ వరకే వెళ్లిన మెట్రో రైల్ ను మైండ్ స్పేస్ వరకు పొడిగించారు. అయితే మైండ్ స్పేస్ దగ్గర ఏర్పాటు చేసిన రాయదుర్గం స్టేషన్ లోకి మాత్రం ప్రయాణికులు రావడం లేదు. హైటెక్ సిటీ వచ్చే ట్రైన్ ఎక్కుతున్నారు. దీనికి కారణం ఏమిటి..? రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు ప్రయాణికులు ఎందుకు ఎక్కువగా రావడం లేదు.? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైలు గత నెలలో మరో మైలురాయిని అధిగమించింది. హైటెక్‌సిటీ - రాయదుర్గం మెట్రో కారిడార్‌లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 40 వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేశారు. హైటెక్ సిటీ - రాయదుర్గం రూట్లో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట కలుగుతుందని భావించారు. కాని అల జరగలేదు.
రాయదుర్గం మెట్రో స్టేషన్ ప్రయాణికులకు చాలా వరకు ఉపయోగపడటం లేదు. రాయదుర్గం స్టేషన్ నుంచి మైండ్ స్పేస్ లోపలికి వంతెన పనులు పూర్తికాకపోవడమే దీనికి ప్రధాన కారణం. అసలు రాయదుర్గం స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు చాలా మంది మైండ్ స్పేస్ లోకి వెళతారు. కాని అక్కడి నుంచి మైండ్ స్పేస్ లోకి వెళ్లడానికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తికాలేదు. దీంతో దాదాపు కిలోమీటరు దూరం నడిచి వెళ్లవలసి వస్తోందంటున్నారు ప్రయాణికులు.
ట్రాఫిక్ సమస్య లేకుండా త్వరగా వెళ‌్లడానికి మెట్రోలో ప్రయాణం చేసి వచ్చినా... బ్రిడ్జ్ లేకపోవడంతో నడుచుకుని వెళ్లడానికి టైం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.