Patnam Narender Reddy: ప్రశ్నిస్తే అరెస్టులా.. వేముల ప్రశాంత్ రెడ్డి

Update: 2024-11-14 11:27 GMT

Patnam Narender Reddy: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకం సరిగా అమలుకావడంలేదని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. తెలంగాణ భవన్‌లో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తోందన్నారు. వాటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగుతున్న వారి గొంతు నొక్కడం, అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం వంటి పద్దతిని రేవంత్ రెడ్డి ఎంచుకున్నట్టు కనబడుతుందన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కూడా ఈ కోవలోకే వస్తుందన్నారు.

కొడంగల్ నియోజకవర్గంలో తన అల్లుడి ఫార్మా ఇండ్రస్ట్రీ కోసం గిరిజనుల భూములు లాక్కునే క్రమంలో అక్కడి ప్రజలు ఎదురుతిరిగారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి వారికి మద్దతుగా నిలిచారన్నారు. 12వ తేదీన సురేష్.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయలేదన్నారు. 11వ తేదీన కేవలం ఒక్కసారి మాత్రమే మాట్లాడారని తెలిపారు.

నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో మూడు నెలల కాల్ డేటా పెట్టి.. డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలనే ఫోబియా రేవంత్ రెడ్డికి పట్టుకుందని చురకలంటించారు. ఏదో ఒకటి చేసి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News