Telangana: ఉస్మానియా ఆసుపత్రికి కొత్తశోభ
Telangana: *ఎంవోటీ ఆధునీకరణ, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు *బిల్డింగ్ లో కొత్త ఐ.సి.యు రూమ్స్
Telangana: తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రిలో సరికొత్త సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎప్పుడు విమర్శలు ఎదుర్కొనే ఉస్మానియా ఆసుపత్రిలో నయా సేవలు పునరుద్ధరించడానికి వైద్యాధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నలభై ఏళ్లనాటి ఎంవోటిని ఆధునీకరిస్తున్నారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెచ్చి విమర్శలకు బదులివ్వడానికి సమాయత్తం అవుతున్నారు.
ఎంతో చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనం కోసం ఎన్నో రోజులుగా వైద్య సిబ్బంది ఎదురుచూస్తున్నారు. రోగుల తాకిడి రోజు రోజుకీ పెరిగిన కొత్త భవనం లేక ఉన్న భవనంలోనే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రభుత్వం కొత్త భవనం అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి మాటలకే మాత్రమే పరిమితం కావడం అందరికీ ఇబ్బందులు తీసుకొని వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న బిల్డింగ్ లో కొత్త ఐ. సి.యు రూమ్స్ తో పాటు కొన్ని మార్పులు చేయబోతుంది.
ఉస్మానియా ఆసుపత్రిలో మార్పులు రావడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ రామ్ సింగ్ అన్నారు. మూడు ఆపరేషన్ థియేటర్స్ తో పాటు అవయవ మార్పిడి కోసం ప్రత్యేక ఆపరేషన్ రూమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. వాటితో పాటు ఫార్మసీ కౌంటర్స్ ను కూడా పెంచుతున్నారని... ఇవన్నీ అతి త్వరలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. అందుబాటులోకి తీసుకొని వచ్చే అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఇబ్బందులు ఉన్న వాటిని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించడం రోగులకు మంచి జరుగుతుందని అన్నారు. ఎన్ని మార్పులు వచ్చినా కొత్త బిల్డింగ్ వస్తే బాగుంటుందని అంటున్నారు ఉస్మానియా డాక్టర్ రామ్ సింగ్.
ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేస్తున్న సర్జికల్ రూమ్స్,లిఫ్ట్,మెడిసిన్ కౌంటర్ అన్ని కూడా పెద్ద రోగులకు మే మొదటి వారంలో అందుబాటులోకి వస్తాయని ఉస్మానియా వైద్యులు చెబుతున్నారు.