ప్రజాభవన్‌లో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

విభజన చట్టంలోని ఆస్తులు, అప్పులపై చర్చించిన ఏపీ, టీజీ సీఎంలు

Update: 2024-07-06 15:30 GMT

ప్రజాభవన్‌లో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు పరిష్కారానికి ఇరు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు నిర్ణయానికి వచ్చారు. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో విభజన అంశాలపై కీలకంగా చర్చించారు. విభజన చట్టంలోని ఆస్తులు, అప్పులపై ఏపీ, టీజీ సీఎంలు మాట్లాడుకున్నారు. హైదరాబాద్ లో కొన్ని భవనాలను తమకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరగా... భవనాలన్నీ తెలంగాణవేనని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌లో ఉన్న స్థిరాస్తులు మొత్తం.. తెలంగాణకే చెందుతాయని ఆయన తేల్చిచెప్పారు. అయితే... అర్జీ పెట్టుకుంటే ఏపీ కోసం భూమి కేటాయిస్తామన్న రేవంత్... ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో భవనం కట్టుకునేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని రేవంత్ కోరగా.. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా.. పరిష్కారాలు ఉండాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News