హైద్రాబాద్ ప్రజాభవన్ లో ప్రారంభమైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

రెండు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చిస్తున్న సీఎంలు రేవంత్‌, చంద్రబాబు

Update: 2024-07-06 13:00 GMT

హైద్రాబాద్ ప్రజాభవన్ లో ప్రారంభమైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శనివారం హైద్రాబాద్ ప్రజా భవన్ లో సమావేశమయ్యారు.రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు జరిగినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ సమస్యలపై జూలై 6న చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఈ నెల 1న లేఖ రాశారు. ఈ సమావేశానికి సానుకూలంగా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.


 ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు నిన్ననే దిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు. జూలై 6 సాయంత్రం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి నేరుగా ప్రజాభవన్ కు చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు స్వాగతం పలికారు. చంద్రబాబును ప్రజా భవన్ లోకి తీసుకెళ్లారు. ప్రజా భవన్ లోని మీటింగ్ లో రెండు రాష్ట్రాల సీఎంల సమావేశమయ్యారు.

Also Read: చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ: అజెండాలోని 4 ముఖ్యాంశాలివే...


Full View

Tags:    

Similar News