Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్‌రావు మొదట సహకరించక పోయినా..ఆ తర్వాత వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 4న హార్డ్ డిస్క్‌లను మూసీలో పడేసినట్టు గుర్తించి.. నాగోల్ దగ్గర మూసీలో ఆ హార్డ్ డిస్క్ శకలాలు వెలికితీసినట్లు వెల్లడించారు. ఇక ప్రణీత్‌రావు చెప్పిన సమాచారంతో ఎస్ఐబీ కార్యాలయంలోనూ పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 12 కంప్యూటర్లు, 7 CPUలు, ల్యాప్‌టాప్, మానిటర్, కేబుళ్లు, పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు సీజ్ చేసి..ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి భుజంగరావు, తిరుపతన్న నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు తిరుపతన్న కుట్ర ఉన్నట్టు రిమాండ్ నివేదికలో ప్రస్తావించారు దర్యాప్తు అధికారులు.