TS High Court: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై విచారణ వాయిదా
TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు
TS High Court: గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ను హైకోర్టు విచారించింది. బయోమెట్రిక్ విధానం ఎందుకు పెట్టలేదని TSPSCని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. బయో మెట్రిక్ విధానంలో సాంకేతికత, సమయం లేకపోవడం వల్లే పెట్టలేకపోయామని ఏజీ తెలిపారు. బయోమెట్రిక్ విధానం వల్ల సమస్యలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. మొదటిసారి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లోనూ బయో మెట్రిక్ సమస్యలు వచ్చాయన్న ఏజీ తెలిపారు. మిగతా పరీక్షలకు బయో మెట్రిక్ విధానం అమలు అవుతున్నప్పుడు.. గ్రూప్-1కు మాత్రమే ఎందుకు సమస్య వస్తుందని పిటిషనర్ ప్రశ్నించారు. కానిస్టేబుల్ పరీక్షకు 6లక్షల మందికి బయో మెట్రిక్ తీసుకున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఏ ఏ పరీక్షల్లో బయో మెట్రిక్ ఎంత మందికి వాడారనే వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.