MLC Kavitha: ఇవాళ ఈడీ స్పెషల్ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు

MLC Kavitha: రాత్రి ఢిల్లీ ఈడీ ఆఫీసులోనే ఎమ్మెల్సీ కవిత

Update: 2024-03-16 03:05 GMT

MLC Kavitha: ఇవాళ ఈడీ స్పెషల్ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని నందీనగర్ నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచే కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు సాయంత్రం అరెస్టు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా నందీనగర్ నివాసానికి చేరుకుని.. ఈడీ,కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కవిత నివాసంలో సోదాలకు వచ్చినప్పుడే.. అమెను అరెస్టు చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టు వారెంట్లుతోనే కవిత నివాసంలో సోదాలు నిర్వహించి.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారన్న సమాచారం అందిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు కవిత నివాసం వద్దకు చేరుకుని ఈడీ అధికారులను కలిశారు.

ట్రాన్సిస్ట్ వారెంట్ లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ఈడీ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు అక్రమం అంటూ కేటీఆర్ ఈడీ అధికారులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇలా అరెస్టు చేస్తు్న్నందుకు గానూ కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈడీ అధికారులకు కేటీఆర్ సూచించగా.. తమ ప్రొసీజన్ తమకు ఉంటుందని ఈడీ అధికారులు కేటీఆర్‌కు బదులిచ్చారు. కాసేపు వాగ్వాదం తర్వాత ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు.

ఉదయం కవిత ఇంట్లో సోదాలు ప్రారంభించినప్పడే సాయంత్రం పక్కగా అరెస్టు చేయాలని ఫిక్స్ అయిన ఈడీ అధికారులు నిన్న రాత్రి 8.15 నిమిషాలకు కవితకు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేశారు. అందుకు అనుగుణంగానే కవితను అదుపులోకి తీసుకోగానే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ తరలించారు.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక భద్రత మధ్య ఈడీ ప్రధాన కార్యాలయానికి కవితను ఈడీ అధికారులు తరలించారు. రాత్రి ఈడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో మహిళా అధికారుల భద్రత మధ్య కవితను ఉంచారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత 10 గంటలకు ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో కవితను ఈడీ అధికారాలు హాజరుపర్చనున్నారు.

14 రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి కోర్టు అనుమతిస్తే తిరిగి ఈడీ కార్యాలయానికి కవితను తీసుకురానున్నారు. ఈడీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ పిటీషన్‌పై ఈడీ అధికారులు, కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

మరో వైపు ఇవాళ సుప్రీం కోర్టులో కవిత ఛాలెంజ్ పిటీషన్ వేయనున్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీం తలుపును మరోసారి తట్టనున్నారు. ఇటు రౌస్ అవెన్యూ కోర్టు, అటు సుప్రీం కోర్టుల్లో విచారణలు ఒకే సారి ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో కోర్టును ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇటు కవిత అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ అధికారులు ఎలా అరెస్టు చేస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు.  

Tags:    

Similar News