Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమైన చేప మందు పంపిణీ.. భారీగా తరలివస్తున్న జనం

Nampally: ఇక చేప మందు పంపిణీకి భారీగా జనం వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు

Update: 2023-06-09 05:25 GMT

Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమైన చేప మందు పంపిణీ.. భారీగా తరలివస్తున్న జనం

Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ చేప మందు పంపిణీని ప్రారంభించారు. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ప్రారంభమవుతున్న చేప మందు స్వీకరించేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. నిన్న సాయంత్రానికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వివిధ ప్రాంతాల నుంచి జనం చేరుకుని.. రాత్రి నుంచే క్యూ కట్టారు. మూడు లక్షలకు పైగా జనం చేప మందు కోసం వస్తారన్న అంచనాలతో బత్తిని కుటుంబం అందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది.

ఇక చేప మందు పంపిణీకి భారీగా జనం వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 32 కౌంటర్లలో చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఇందులో చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా చేప మందు పంపిణీ కార్యక్రమానికి తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. చేప ప్రసాదం కోసం వస్తున్న వారికి నీరు, ఆహార సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇక పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు, మొత్తం 2 వేల మంది పోలీసులు చేప మందు పంపిణీ కార్యక్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News