టీఆర్ఎస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఓటింగ్ శాతం తగ్గించేందుకు టీఆర్ఎస్ కుట్ర చేసిందని విమర్శించారు. మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవబోతోందని టీఆర్ఎస్ భయపెట్టినా ఓటర్లు బెదరలేదన్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో ఎస్‌ఈసీ పనిచేసిందన్న బండి సంజయ్ అవగాహనలేని వ్యక్తిని ఎస్‌ఈసీని చేశారని మండిపడ్డారు. పార్టీల గుర్తులు కూడా ఎస్‌ఈసీకి తెలియదని ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ పూర్తిగా విఫలంమైందన్నారు.
బీజేపీ కార్యాలయంలో డీకే అరుణ, లక్ష్మణ్, వివేక్ చేపట్టిన ఉపవాస దీక్షను విరమించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం పాల్పడుతుందని, పోలీసులు, ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ ఆ ముగ్గురు నేతలు ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేపట్టారు.