MLA poaching case: ఇవాళ హైకోర్టులో ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ

MLA poaching case: నిన్న వర్చువల్‌గా వాదనలు వినిపించిన న్యాయవాదులు

Update: 2023-01-11 03:20 GMT

MLA poaching case: ఇవాళ హైకోర్టులో ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ

MLA poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాడివేడిగా వాదనలు కొనసాగాయి. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం, సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఆడియో, వీడియో తమవే అని నిందితులు ఒప్పుకున్నారని దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వివరాలు మీడియాకు వెళ్లిన తర్వాతే సీఎంకు చేరాయని సీఎం ప్రెస్‌మీట్ కంటే 4 రోజుల ముందే బీజేపీ కోర్టును ఆశ్రయించిందన్నారు. మొదటి నుంచి విచారణ ఆపాలనే బీజేపీ ముఖ్య ఉద్దేశ్యమన్న దవే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే బీజేపీ ప్రయత్నించిందన్నారు.

ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐ విచారిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని న్యాయవాది దుష్యంత్ దవే వర్చువల్‌లో వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండు దఫాలుగా బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. బీఆర్ఎస్‌ను అనైతికంగా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు దవే. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాల అంశాలపై వీడియో, ఆడియో రికార్డులను ACP గంగాధర్ సీజ్ చేసిన విషయాన్ని దుష్యంత్ దవే హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై FIR నమోదైన తర్వాతే కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారని తెలిపారు. అయితే FIRలో పేర్కొన్న అంశాలను కేసీఆర్ మీడియాలో ప్రస్తావించలేదని దవే చెప్పారు.

ఇక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరపు గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. సీఎంకు సీడీలు రోహిత్ రెడ్డినే ఇచ్చారని ఆ విషయాన్ని సీఎం బహిరంగంగానే చెప్పారని ఆ విషయాలను బీజేపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చిందని తెలిపారు. కోర్టు నుంచి ఎలాంటి నోటీసు సర్వ్ కాలేదన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. సీబీఐ కేంద్ర ఆధీనంలో పనిచేస్తుందని నిందితులు దర్యాప్తు సంస్థను ఎంచుకునేందుకు అధికారం ఉందా నిందితులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ఫిర్యాదుదారుడుకి అలాంటి హక్కులే ఉన్నాయన్నారు.

ఇక తుషార్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏ పార్టికి కొమ్ము కాయదన్నారు. కానీ సిట్‌లో దర్యాప్తు చేసే అధికారులకు ట్రాన్స్‌ఫర్‌లు, ప్రమోషన్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. నేరం రుజువు కాక ముందే ఆధారాలు పబ్లిక్ డొమైన్లోకి వచ్చాయన్నారు. ఇక ప్రభుత్వం తరపున ఇవాళ దుష్యంత్ దవే పూర్తి వాదనలను వినిపించాలని ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కోర్టు కేసును వాయిదా వేసింది. ఇక సీబీఐ ఎలాంటి వాదనలు వినిపిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News