Bonalu Festival: బోనాల ఏర్పాట్లు షురూ.. 30న గోల్కొండలో తొలి బోనం..!

Bonalu Festival: బోనాల ఏర్పాట్లు షురూ.. 30న గోల్కొండలో తొలి బోనం..!

Update: 2022-06-12 11:30 GMT

Bonalu Festival: బోనాల ఏర్పాట్లు షురూ.. 30న గోల్కొండలో తొలి బోనం..!

Bonalu Festival: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల జాతరకు హైదరాబాద్‌ సిద్దమవుతోంది. ఈ నెల 30 గోల్కొండ బోనాలతో వేడుకలు షురూ కానున్నాయి. నెల రోజుల పాటు కొనసాగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే బోనాల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. చిన్నా, మహిళలు నెత్తిన బోనమెత్తుకొని భక్తిశ్రద్ధలతో అమ్మకు బోనం సమర్పిస్తారు.

ఈ బోనాలు గోల్కొండ కోట నుంచి మొదలై దాదాపు నెలరోజులపాటు వైభవంగా జరుగుతాయి అయితే కరోనాతో కారణంగా రెండేళ్ల నుంచి నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30న గోల్కొండ బోనాల‌తో ఆషాఢ మాసం భోనాలు ప్రారంభమవుతాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక జులై 17న ఉజ్జయిని మ‌హంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భ‌విష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జులై 24న భాగ్యన‌గ‌ర బోనాలు, 25న ఉమ్మడి దేవాల‌యాల ఘ‌ట్టాల ఊరేగింపు జరుపుతారు. జులై 28న బోనాల జాతర ముగియ‌నుంది. బోనాల ఏర్పాట్లని రాజకీయ నాయకులు, అధికారులు దగ్గరుండి పరిశీలించడం విశేషం. ఏది ఏమైనప్పటికీ బోనాల పండుగతో భాగ్యనగరం కొత్త రూపు సంతరించుకుంటుంది.

Tags:    

Similar News