Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నిరసన, ఉద్రిక్తత

Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

Update: 2024-12-09 05:39 GMT

Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నిరసన, ఉద్రిక్తత

Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అమరవీరులను స్మరిసంచుకొంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాట పాడారు.సీఎం రేవంత్ -అదానీ ఫోటోలు ముద్రించిన ఫోటోలున్న టీ షర్ట్ లను బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ధరించారు. ఈ టీ షర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.టీ షర్టులు తీసివేసేందుకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో అసెంబ్లీ ముందే రోడ్డుపై బైఠాయించారు.

కాంగ్రెస్ నేతలు దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ కడుతున్నారని గులాబీ పార్టీ నాయకులు విమర్శించారు. ఈ విషయమై అసెంబ్లీలో నిరసనకు దిగుతామని బీఆర్ఎస్ ప్రకటించింది.

పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసనకు దిగలేదా?: బీఆర్ఎస్

అదానీ ఫోటోలున్న టీ షర్టులు ధరించి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ కు వెళ్లిన విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. రాహుల్ కు ఓ నీతి.. రేవంత్ కు మరో నీతా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News