GHMC ఎన్నికలపై రాజకీయ పార్టీలతో నేడు ఈసీ సమావేశం

Update: 2020-11-12 02:29 GMT

మొన్నటి దాకా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రేపిన దుబ్బాక ఉపఎన్నిక పూర్తైంది. దీంతో ఇప్పుడు అందరి చూపూ హైదరాబాద్‌ నగరంపై పడింది. దుబ్బాకలో అనూహ్య పరిణామాలతో గ్రేటర్‌లో రాజకీయాలు ఊపందుకున్నాయి. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. దుబ్బాక ఫలితాలతో ముందస్తుగా అలర్ట్ అయ్యాయి అన్ని పార్టీలు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ పాలకమండలికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మాత్రమే గడువుంది. అప్పటిలోగానే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో అన్ని పార్టీలు ఎప్పుడు ఎన్నికలున్నా రెడీగా ఉండేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ కేడర్‌లకు దిశానిర్దేశం చేసిన నేతలు ఇకపై గ్రేటర్‌లో ప్రజల మధ‌్యకు వెళ్లాలని భావిస్తున్నారు.

అయితే ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలుపెట్టిన స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ ఇవాళ ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహిస్తోంది. సమావేశానికి అన్ని పార్టీల నుంచి ఇద్దరు హాజరయ్యేలా ఆహ్వానం పంపింది ఈసీ. ఒక్కో పార్టీకి మాట్లాడేందుకు 15 నిమిషాల సమయం కేటాయించింది. అన్ని పార్టీల నుంచి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాపై అభిప్రాయాలు స్వీకరించనున్న ఈసీ సమావేశం తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News