మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

Update: 2021-01-23 13:00 GMT

మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు


పదో తరగతి వార్షిక పరీక్షలపై స్పష్టత వచ్చింది. ఈసారి మే 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ స్పెష‌ల్ చీఫ్‌ సెక్ర‌ట‌రీ చిత్రా రాంచంద్ర‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఆరు స‌బ్జెక్టుల‌కు 11 ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. కానీ ఈసారి కేవ‌లం ఆరు స‌బ్జెక్టుల‌కు ఆరు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. నాలుగు ఎఫ్ఏ(ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌) టెస్టుల‌కు గానూ రెండు ఎఫ్ఏ టెస్టుల‌ను మాత్ర‌మే నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి ఎఫ్ఏను మార్చి 15న‌, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15న నిర్వ‌హించ‌నున్నారు. స‌మ్మేటివ్ అసెస్‌మెంట్‌ను మే 7 నుంచి 13వ తేదీ మ‌ధ్య‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి 9, 10వ త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు పాఠాలు బోధించ‌నున్నారు. ప‌ది ప‌రీక్ష‌లు ముగిసిన మ‌రుస‌టి రోజు(మే 26) నుంచి జూన్ 13వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News