తెలంగాణలో మరోసారి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
Registration Fees: తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరోమారు పెరగనున్నాయి.
Registration Fees: తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరోమారు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్ విలువల్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.