తెలంగాణలో పోలీస్ శాఖ అప్రమత్తం
తెలంగాణ కరోనా వారియర్స్ గా ఉన్న పోలీస్ సిబ్బంది వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంధి కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ కరోనా వారియర్స్ గా ఉన్న పోలీస్ సిబ్బంది వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంధి కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పోలీస్ శాఖ డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపారు. ఈ టీమ్ లు అన్ని కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లు తొలి విడతలో అధికంగా కేసులున్న స్టేషన్‌లను శుభ్రం చేస్తున్నాయి.
అంతే కాదు ఈ డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్‌లను శుద్ధి చేయనున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో పల్స్ ఆక్సీమిషన్స్ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి సెలవుపై వెళ్లాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా నిబంధనలు అమల్లోకి రానున్నాయి.