కరోనా కొత్త వేరియెంట్‌తో తెలంగాణ సర్కార్ అప్రమత్తం

Update: 2020-12-22 04:26 GMT

కొత్త రకం కరోనా వేరియంట్‌ బయటపడటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ఆరాలు మొదలు పెట్టింది. విదేశాల నుంచి వచ్చే వారికి.. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారికి శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో వైద్యారోగ్య శాఖ టెస్టులు చేయిస్తోంది. ఇందుకు మొత్తం 14 మందితో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు అధికారులు. నెగెటివ్ వచ్చినా వారం రోజుల క్వారంటైన్‌లో ఉంచేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక కొత్త స్ట్రెయిక్ తర్వాత లండన్ నుంచి 3 వేల మందికి పైగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రైక్ స్టార్ట్ అయిందా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

యూకే నుంచి రోజూ హైదరాబాద్‌కు రెండు విమానాలు వస్తున్నాయి. వీటితో పాటు కనెక్టివిటీ ఫ్లైట్లు 11 వరకు వస్తున్నాయి. వీటిలో రోజుకు 6 వందల మందికి పైగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. దాంతో ఎయిర్‌పోర్టు వర్గాల నుంచి వారి డేటాను సేకరించింది వైద్యారోగ్య శాఖ. గతంలో కూడా విమాన ప్రయాణాలతోనే కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ సారి ముందస్తుగా అప్రమత్తమైంది ప్రభుత్వం. అయితే కొత్త రకం వైరస్‌లో 86 శాతం లక్షణాలు కనిపించకపోవటం లక్షణాలు చూపినా త్వరగా బయటపడకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అప్పటిలోగా వ్యాప్తి చెందితే పరిస్థితేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Full View


Tags:    

Similar News