Telangana old secretariat history: తెలంగాణా సచివాలయం భవనాల చరిత్ర
Telangana old secretariat history: పాత సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కోర్టు అనుమతి ఇచ్చిన వెంటనే సచివాలయం కూల్చివేత మొదలు పెట్టేశారు. ఇక ఈ సందర్భంగా పాత సచివాలయం విశేషాలు కొన్ని మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చరిత్రలో కలిసిపోతున్న ఈ సచివాలయం నేపధ్యం... అందించిన సేవలు ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం.
పాత సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కోర్టు అనుమతి ఇచ్చిన వెంటనే సచివాలయం కూల్చివేత మొదలు పెట్టేశారు. ఇక ఈ సందర్భంగా పాత సచివాలయం విశేషాలు కొన్ని మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చరిత్రలో కలిసిపోతున్న ఈ సచివాలయం నేపధ్యం... అందించిన సేవలు ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న పాత సచివాలయం మొత్తం 25 ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడింది. ప్రస్తుతం సచివాలయంగా కొనసాగుతున్న ఈ భవనాన్ని పూర్వం సైఫాబాద్ ప్యాలెస్ గా పిలిచే వారు. ఆ సమయంలో ఇక్కడ హుస్సేన్ సాగర్ కనిపించేలా నిర్మించారు. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైఫాబాద్ లో ఉన్నందుకు దీన్ని ఆ పేరుతో పిలిచేవారు. ఈ ప్యాలెస్ లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాతో నిర్మించబడింది. నిజాం రాజులు రాష్ట్రాన్ని పాలించే సమయంలో ఈ సైఫాబాద్ ప్యాలెస్ ఖాజానాగా ఉపయోగపడింది. అప్పుడు కట్టిన ప్యాలెస్ ఇప్పుడు రాష్ట్ర సచివాలయంలోని జి-బ్లాకుగా ఉపయోగించబడుతుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అంటే 1956 అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ భవనం సైఫాబాద్ ప్యాలెస్ నుంచి సచివాలయంగా మారిపోయింది. అప్పటి నుంచి ఈ భవనంలో ఇక్కడ అప్పటి నుంచీ అవసరాలను బట్టి ఒక్కో బ్లాక్ నిర్మిస్తూ వచ్చారు. మొత్తం 25 ఎకరాల్లో బీ, సీ బ్లాక్‌లను 1978లో, ఏ బ్లాక్‌ను 1998లో, డీ బ్లాక్‌ను 2003లో నిర్మించారు. 2012లో హెచ్ (నార్త్), హెచ్ (సౌత్) బ్లాకులను కట్టారు.
ఈ బ్లాకుల నిర్మాణం చేపట్టక ముందు బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, భవనం వెంకట్రామ్, టి. అంజయ్య, నేదురుమల్లి జనార్ధనరెడ్డి తదితర ముఖ్యమంత్రులు జి బ్లాక్ నుంచి పరిపాలన వ్యవహారాలు కొనసాగించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయాలను వాటిల్లోకి మార్చాడు. చివరగా నందమూరి తారక రామారావు ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులోనే తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
నిర్మాణం
ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన నివాసంకోసం 1887లో లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. డంగ్ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో పెద్ద గోడలు, ఎత్తైన గేట్లతో 1888లో యూరోపియన్ శైలిలో రెండంతస్తుల్లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మించబడింది. కానీ ఆలీఖాన్ ఒక్కరోజు కూడా ఈ భవనంలో గడపలేదు.
పాత సచివాలయం చరిత్ర
మహబూబ్ అలీ ఖాన్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు, హుస్సేన్ సాగర్ సమీపంలోని ప్రశాంత వాతావరణంలో సేద తీరితే ఆరోగ్యం మెరుగవుతుందని ఆస్థాన వైద్యులు (హకీంలు) సూచించారు. 1987లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మాణం జరుగుతుండగా, ఒక రోజు తన ఆస్థాన ప్రధాన మంత్రి మహారాజ కిషన్ ప్రసాద్‌తో కలసి ప్యాలెస్‌ను చూడడానికి ఏనుగు అంబారీపై అలీ ఖాన్ బయల్దేరాడు. ప్యాలెస్ సమీపంలోకి రాగానే ఒక అశుభ సూచకం ఎదురొచ్చింది. అది చూసిన జ్యోతిషులు పురానా హవేలీని వదలడం మంచిది కాదని నిజాంకు జోస్యం చెప్పడంతో సైఫాబాద్ ప్యాలెస్ కు వచ్చే ఆలోచనను మానుకున్నాడు. దాంతో నిజాం ఆర్థికమంత్రి సర్ అక్బర్ హైద్రీ, ప్రధానమంత్రి కార్యాలయాల కోసం ఈ ప్యాలస్ కేటాయించబడింది.
సచివాలయం ఎప్పుడు తరలించారు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత సచివాలయం నుంచి ఉద్యోగులను 2019 ఆగస్టులో బీఆర్‌కే భవన్‌కు తరలించారు. పాత సచివాలయంలో అధికారులు, ఉద్యోగులు ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించడంతో అప్పుడు దానిని పూర్తిగా ఖాళీ చేశారు. ఆ తరువాత అదే నెల 9వ తేది నుంచి సచివాలయన కార్యకలాపాలు అక్కడి నుంచి జరిపించారు.
పాత సచివాలయంలో లోపాలేంటి?
కొన్ని రోజలు క్రితం వరకు పాత సచివాలయంలో వాస్తు సరిగ్గా లేదని పూర్తిగా కూల్చి పునర్మించాలని కేసీఆర్ అనుకున్నారు. అయితే పాత సచివాలయం కూల్చివేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నట్టు సమాచారం. పాత సచివాలయం దగ్గర పార్కింగ్ స్థలం సరిగ్గా లేదని, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సందర్భాల్లోనూ సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోందని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. అధికారులు, సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడం కష్టంగా ఉందని, ఫైళ్ల తరలింపులోనూ ఇబ్బందులు ఉంటున్నాయని ప్రభుత్వం గతంలో వివరించింది. అంతే కాకుండా పాత సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేవని, ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు లేవని గతంలో వివరించింది. అంతే కాక ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు కొరవడ్డాయని భావించింది. అంతే కాక ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే జనం బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేరని, నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి ఈ నిర్మాణాలు లేవని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు గతంలో తెలిపారు.
పాత సచివాలంయలో విభాగాలు
వ్యవసాయం మరియు సహకారం
పశుసంవర్ధక మరియు మత్స్య సంపద
వెనుకబడిన తరగతుల సంక్షేమం శాఖ
వినియోగదారుల వ్యవహారాలు ఆహారం & సామాగ్రి
మాన్యాలు
పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఫైనాన్స్
జనరల్ అడ్మినిస్ట్రేషన్
ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమం
ఉన్నత విద్య
హోమ్
గృహ
పరిశ్రమలు, వాణిజ్యం
సమాచారం, ప్రజా సంబంధాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్
మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడి
నీటిపారుదల మరియు CAD
కార్మిక, ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాలు
లా
మైనారిటీల సంక్షేమం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణ అభివృద్ధి
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి
ప్రణాళిక
పబ్లిక్ ఎంటర్ప్రైజెస్
రెవెన్యూ
రోడ్లు మరియు భవనాలు
పాఠశాల విద్య
సామాజిక సంక్షేమం
రవాణా
మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లు
యువత అభివృద్ధి, పర్యాటక మరియు సంస్కృతి