Telangana: మినీ పురపోరు.. కొనసాగుతున్న కౌంటింగ్
Telangana: తెలంగాణలో మినీ పురపాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది.
Telangana: తెలంగాణలో మినీ పురపాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఇటీవల జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ వార్డులకు సైతం ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సిద్ధిపేట, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కరోనా.తీవ్రత దృష్ట్యా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, జన సమీకరణలు, సమావేశాలకు అనుమతి లేదు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల పేర్కొంది,
కొత్తూరు మున్సిపాలిటీలో ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ 2 వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 2 వార్డులో విజయం సాధించింది. ఇక్కడ 12 వార్డులకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అచ్చంపేట ఒకటో వార్డు కాంగ్రెస్ గెలుపొందగా..కొత్తూరు ఏడో వార్డు,ఖమ్మం 13వ వార్డు,అచ్చంపేట 16వ వార్డులో అధికార పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు.