అదనపు కలెక్టర్లు, మేయర్లు, చైర్‌పర్సన్‌లు.. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు.. గ్రీనరీ నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచన

Update: 2021-12-31 05:40 GMT

అదనపు కలెక్టర్లు, మేయర్లు, చైర్‌పర్సన్‌లు.. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

KTR: రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌లు, మేయర్లు, చైర్‌పర్సన్‌లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీఆర్.స్థానిక సంస్థల పరిధిలో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, గ్రీనరీ నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల ఎలాంటి ఆటంకం లేకుండా స్థానిక సంస్థలకు నిరాటంకంగా నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. 

Tags:    

Similar News