మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ.. నైట్ కర్ఫ్యూ పై కీలక ప్రకటన?

Night Curfew: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Update: 2022-01-17 06:35 GMT

మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ.. నైట్ కర్ఫ్యూ పై కీలక ప్రకటన? 

Night Curfew: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించేందుకు సమాలోచనలు చేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చింనున్నది. ముఖ్యంగా థియేటర్లు, మాల్స్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్చలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో ఉన్న వసతులు, ఆక్సిజన్, ఔషధాల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. కరోనాతో పటు ప్రధానంగా రాష్ట్రంలో వ్యవసాయంపై కూడా మంత్రివర్గం చర్చించనున్నది. ధాన్యం కొనుగోళ్లుపై కేంద్రం పేచీలు, ఎరువుల ధరల అంశం మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు రానుంది.

మరోవైపు ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలు అనుసరించాల్సిన వైఖరిపై కూడా కేబినెట్‌లో చర్చించే చాన్స్ ఉంది. నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో వచ్చిన అప్పీళ్లు, ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News