తెలంగాణలో కొత్తగా మరో 805 కరోనా కేసులు
* జీహెచ్‌ఎంసీ పరిధిలో 131 పాజిటివ్ కేసులు * కరోనా బారిన పడి నలుగురు మృతి * రాష్ట్రంలో ప్రస్తుతం 10వేలకుపైగా యాక్టివ్ కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా మరో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 131 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2లక్షల 69వేల 223కి చేరింది. 24గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య వేయి 455కి చేరింది. కరోనా బారి నుంచి 948 మంది కోలుకుగా. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ‌్య 2లక్షల 57వేల 278కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10వేల 490 యాక్టివ్ కేసులు ఉండగా. 8వేల 367 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.