Breaking News: తెలంగాణ హోం మంత్రికి కరోనా పాజిటివ్

Update: 2020-06-29 04:55 GMT

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్ట్ లలో మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మహమూద్ ఆలీకి ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని కుటంబ సభ్యులు తెలిపారు.

తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. కాగా, రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం మరో 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,419కి చేరింది. 9వేల మంది వివిధ ఆస్పత్రులు, చికిత్స పొందుతుండగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది. 

Tags:    

Similar News