దీపావళి పండుగ పై తెలంగాణా హైకోర్టు కీలక ఆదేశాలు
* తెలంగాణ బాణసంచాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు * రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను మూసివేయాలని ఆదేశం * కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే * హైకోర్టు ఆదేశాలతో వ్యాపారుల్లో టెన్షన్ టెన్షన్ * లక్షల రూపాయలు పెట్టి సరుకు తెచ్చామని.. * ఇప్పుడు సడెన్‌గా బ్యాన్ చేస్తే నష్టపోతామంటున్న వ్యాపారులు
దీపావళి పండుగ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సారి దీపాలను మాత్రమే వెలుగించాలని.. బాణసంచాను బ్యాన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టపాసులు పేల్చడం వల్ల ప్రజలతో పాటు కరోనా వైరస్ బాధితులు శ్వాసకోస సమస్యలతో బాధపడే అవకాశముందని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై స్పందించిన హైకోర్టు టపాసులను నిషేధించాలని ఆదేశించింది. ఇక వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత నిబంధనలు రావడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది..
హిందూవుల అదిపెద్ద పండుగ దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దీపావళికి దీపాలు మాత్రమే వెలుగించాలని.. పండగల కంటే ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో బాణసంచా కాల్చకుండా, విక్రయించాకుండా నిషేధం విధించాలని, రాష్ట్ర వ్యాప్తంగా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో బాణసంచా వ్యాపారుల్లో గుబులు పుట్టుకుంది.
బాణసంచా నిషేధాలపై ముందస్తుగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయకపోవడంతో నెల ముందుగానే స్టాల్స్ ఏర్పాటుకు, ఇతర ఖర్చుల కోసం భారీగా పెట్టుబడి పెట్టామని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు సడన్‌గా వ్యాపారాలు మూసివేయాలంటే తాము నష్టంపోతమంటున్నారు..
తెలంగాణ హై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం షాపులు క్లోజ్ చేపిస్తే ఎలా అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ కారణంగా చాలా వరకు షాపులు తెరవలేదు. ఇక తెరిసిన షాపు యజమానులు వారం నుంచి బిజీబిజీగా జనంతో రద్దీగా ఉండాల్సిన షాపులు వెలవెలబోతున్నాయని యజమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏడాది దీవాళితో అవుట్ లేట్ టాపాసుల వ్యాపారులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఖాళీ గ్రౌండ్స్‌లో, ఫంక్షన్ హాల్స్ లో సైతం బాణసంచా వ్యాపారం ఊపందుకునేది. కానీ, ఈ సారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముందే చెప్తే ఇలా నష్టపోవాల్సిన అవసరం లేకుండా ఉండేదని వ్యాపారులు అంటున్నారు.
తెలంగాణ హైకోర్టు ఈ దీవాళికి బాణసంచా కాల్చాకూడదంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టాపాసులు కొనుగోళ్ల అమ్మకాలపై నిషేధించింది. తెలంగాణలో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో పిటిషనర్ ఈ దివాళికి కొనడం, అమ్మడం నిషేధించాలని పిటిషనర్ కోరారు.
ఇప్పుడు సడెన్ షాపులు క్లోజ్ చేస్తే మా పరిస్థితి ఏంటని క్రాకర్స్ వ్యాపారులు ఆందోళనకు గురివుతున్నారు. అప్పులు చేసి టపాసుల వ్యాపారం చేస్తున్న తమ పై సడన్‌గా ఇలా నిర్ణయం తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నమంటున్నారు.