చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ.. రూ. 30 లక్షల జరిమానా విధించిన హైకోర్టు

Chennamaneni Ramesh: చెన్ననమనేని రమేశ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది.

Update: 2024-12-09 05:49 GMT

చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Chennamaneni Ramesh: చెన్ననమనేని రమేశ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు తెలిపింది.విచారణ సమయంలో తమను తప్పుదోవ పట్టించడంపై ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన జర్మనీ పౌరుడేనని హైకోర్టు స్పష్టం చేసింది.

నష్టపరిహారంగా అప్పట్లో చెన్నమనేని రమేశ్ పై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్ కు ఈ డబ్బులు చెల్లించాలని కోర్టు కోరింది. మరో వైపు రూ. 5 లక్షలను లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

భారత ప్రభుత్వం 2019లో తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సుదీర్ఘ విచారణ నిర్వహించింది.ఈ విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెల్లడించింది. 

భారత ప్రభుత్వం 2019లో తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సుదీర్ఘ విచారణ నిర్వహించింది.ఈ విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెల్లడించింది. 2009 నుంచి చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై వివాదాలున్నాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వంపై పోరాటం చేస్తున్నారు. 2008 లో రమేశ్ ఇండియాకు వచ్చారు. 2009లో తొలిసారిగా వేములవాడ నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో రమేశ్ టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. వేములవాడ నుంచి వరుసగా ఆయన 2014 వరకు గెలిచారు. పౌరసత్వం వివాదం నేపథ్యంలో 2023లో బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ గెలిచారు.


Tags:    

Similar News