Bail To Potluri Vara Prasad : తెలంగాణ హైకోర్టులో వైసీపీ నేత పీవీపీకి ఊరట

Update: 2020-07-01 05:12 GMT

Telangana High Court grants anticipatory bail to Potluri Vara Prasad: తెలంగాణ హైకోర్టులో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కి ఊరట లభించింది. ల్యాండ్ గ్రాబరి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పీవీపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఉన్నత న్యాయ స్థానం మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది హైకోర్టు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో గోడవివాదంలో.. కైలాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం పివిపి విల్లాస్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్. అయితే ఆ సమయంలో ఎలాంటి రూల్స్ పెట్టకుండా విక్రయించారు అంటున్నారు ఆయన… కానీ ఇప్పుడు టెర్రస్‌పై గార్డెన్‌ నిర్మిస్తుంటే వద్దని పివిపి బెదిరిస్తున్నారని ఆరోపించారు.. దీనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయగా.. పివిపి తనపై దౌర్జన్యానికి దిగారని కైలాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 మంది వ్యక్తులను తమ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు కైలాష్.


Tags:    

Similar News